ఒకే విమానంలో గౌహతి బయల్దేరిన చంద్రబాబు, లోకేష్

  • రేపు అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం
  • ఎన్డీయే భాగస్వాములుగా ఈ కార్యక్రమానికి చంద్రబాబు, లోకేష్ హాజరు
  • ఢిల్లీలో చంద్రబాబు, లోకేష్ లకు వీడ్కోలు పలికిన టీడీపీ ఎంపీలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఒకే విమానంలో గౌహతికి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు, సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన లోకేష్.. ఇద్దరూ కలిసి సోమవారం రాత్రి గౌహతి పయనమయ్యారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఈ కార్యక్రమానికి ఎన్డీయే పెద్దలు వస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా తమ ఎన్డీయే భాగస్వాములతో కలిసి హిమంత పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. 

గౌహతి వెళ్లడానికి ముందు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో తన పర్యటనను ముగించుకున్నారు. కేంద్ర మంత్రులతో, పలువురు ఎంపీలతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ఢిల్లీ విమానాశ్రయంలో ఎంపీలు కేశినేని శివనాథ్ (చిన్ని), అప్పలనాయుడు తదితరులు చంద్రబాబు, లోకేష్ లకు వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా ఎంపీలతో జరిగిన భేటీలో రాష్ట్ర అభివృద్ధి, కేంద్రంతో సంబంధాలపై చర్చ జరిగింది. ప్రధాని మోదీ ఇటీవల తన నివాసానికి రావడం పట్ల చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారని, దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మరింత పెరిగిందని ఆయన, లోకేష్ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. 

Chandrababu Naidu
Nara Lokesh
Gauhati
Assam CM Swearing Ceremony
Himanta Biswa Sarma
NDA Alliance
Andhra Pradesh Development
Delhi Visit
Kesineni Srinivas
Appalanayudu

More Telugu News