నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్

  • నాపై కుట్ర జరుగుతోందంటూ బండి సంజయ్ భావోద్వేగం
  • కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంపై స్పందన
  • రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • సికింద్రాబాద్ సభలో వేదికపై కంటతడి పెట్టుకున్న బండి సంజయ్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సభా వేదికపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై కొందరు కుట్రలు పన్నుతున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

వివరాల్లోకి వెళ్తే, బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 17 ఏళ్ల బాలికను వేధించారంటూ ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన బండి సంజయ్.. ఈ విషయంపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ సభకు ముందు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ 'పొలిటికల్ హిట్ జాబ్' జరిగిందని అన్నారు. ఒక బీసీ నాయకుడిగా తాను ఎదగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.

Bandi Sanjay
Bandi Sanjay Kumar
Telangana Politics
POCSO Act
Sai Bhagirath
Cyberabad Police
Political Conspiracy
Parade Grounds
Secunderabad
Narendra Modi

More Telugu News