హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ

PM Modi Visits Pawan Kalyan at Hyderabad Residence
  • హైదరాబాద్‌లో మోదీ పర్యటన 
  • ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను పరామర్శించిన ప్రధాని
  • పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కృతజ్ఞతలు తెలిపిన పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని, ఆదివారం జూబ్లీహిల్స్‌లోని పవన్ కల్యాణ్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లారు. ఇటీవల సైనస్ సమస్య కారణంగా పవన్ శస్త్రచికిత్స చేయించుకుని, ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను కలుసుకున్న ప్రధాని మోదీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని, తిరిగి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. తన కోసం స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించడం పట్ల పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

పవన్‌ను పరామర్శించిన అనంతరం, ప్రధాని మోదీ జూబ్లీహిల్స్ లోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. 
Go Back to Shorts
Pawan Kalyan
Narendra Modi
Chandrababu Naidu
Hyderabad
Jubilee Hills
Andhra Pradesh
Deputy CM
Sinus Surgery
Health Update
Political News

More Telugu News