"ఖజానా ఖాళీ" అని అప్పుడే సాకులు చెప్పొద్దు... విజయ్‌కు స్టాలిన్ చురకలు!
- తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు మాజీ సీఎం స్టాలిన్ అభినందనలు
- రూ.10 లక్షల కోట్ల అప్పు ఆరోపణలను ఖండించిన స్టాలిన్
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే విజయ్ హామీలు ఇచ్చారని విమర్శ
- త్వరలోనే పాలనలోని సూక్ష్మాలను నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూనే, తీవ్రమైన రాజకీయ విమర్శలతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు.
"తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మీరు సంతకం చేసిన ఉత్తర్వులను కూడా నేను స్వాగతిస్తున్నాను.
అయితే, వస్తూనే ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని మాట్లాడటం మొదలుపెట్టవద్దు. అవన్నీ ఉన్నాయి. ప్రజలకు ఇవ్వాలన్న మనసు, పరిపాలనా దక్షత మాత్రమే కావాలి. గత ఐదేళ్లలో మేము కోవిడ్, వరదలు వంటి ఎన్నో సమస్యలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వివక్షను ఎదుర్కొని లెక్కలేనన్ని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశాం.
‘గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పు చేసి, ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయింది’ అని మీ మొదటి ప్రసంగంలోనే ఆరోపించారు కదా. తమిళనాడు అప్పులు అనుమతించిన పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి గత ఫిబ్రవరి బడ్జెట్లోనే మేము స్పష్టంగా చెప్పాం. ఆ విషయం మీకు తెలియదా? ఆ తర్వాతే కదా మీరు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది? మీకు ఓటు వేసిన ప్రజలను మళ్లీ తప్పుదోవ పట్టించి మోసం చేయకండి.
‘ఆచరణ సాధ్యమైన వాటినే హామీలుగా ఇస్తాను’ అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పాలనలోకి అడుగుపెడుతున్నారు. త్వరలోనే, మాలాగా మీరు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలనే మెలకువలను నేర్చుకుంటారని నేను నమ్ముతున్నాను. ఓటు వేసిన ప్రజలతో పాటు, నేను కూడా అదే ఆశిస్తున్నాను.
మీ పాలనలో తమిళనాడు అభివృద్ధి ప్రయాణం కొనసాగాలని మరోసారి ఆకాంక్షిస్తూ, నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అంటూ స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.