ఫస్ట్ బాల్‌కే సిక్స్.. 'సిక్సర్ల' సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు
- 40 లోపు బంతుల్లో రెండు ఐపీఎల్ సెంచరీల రికార్డు వైభవ్ పేరు మీదే
- ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్
- నిన్నటి మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టిన వైభవ్
- 514 బంతుల్లో సిక్సర్ల సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ రికార్డులను తిరగరాస్తున్నాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 40 లోపు బంతుల్లోనే రెండు ఐపీఎల్ సెంచరీలు (ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో, ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లో) సాధించిన ఏకైక బ్యాటర్ కూడా. శనివారం, సూర్యవంశీ మరో ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో తొలి బంతికే సిక్సర్ కొట్టి, టీ20లలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం 514 బంతుల్లోనే సిక్సర్ల 'సెంచరీ' మైలురాయిని చేరుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడు కూడా ఇతనే కావడం గమనార్హం.
నిన్న గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ 16 బంతుల్లో 36 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. అతని మూడు సిక్సర్లూ పవర్‌ప్లేలోనే వచ్చాయి. ఒక ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కూడా ఇప్పుడు సూర్యవంశీ పేరిట నమోదైంది.
ఒక ఐపీఎల్ సీజన్‌లో పవర్‌ప్లేలో (1-6 ఓవర్లు) అత్యధిక సిక్సర్లు
30 - వైభవ్ సూర్యవంశీ (2026)
29 - అభిషేక్ శర్మ (2024)
27 - అభిషేక్ శర్మ (2026)
22 - సనత్ జయసూర్య (2008)
22 - ట్రావిస్ హెడ్ (2024)
22 - యశస్వి జైస్వాల్ (2025)
వైభవ్ సూర్యవంశీ 30 సిక్సులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో అభిషేక్ శర్మ, సనత్ జయసూర్య, ట్రావిష్ హెడ్, యశస్వీ జైశ్వాల్ ఉన్నారు.