ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేసిన విజయ్

Vijay First Sign on Free Electricity File as CM
  • 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • మహిళా భద్రత, ఉచిత బస్సు ప్రయాణం ఫైళ్లపై కూడా సంతకం
  • విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈరోజు ఉదయం పది గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో తాను హామీ ఇచ్చిన విధంగా వివిధ ఫైళ్లపై సంతకాలు చేశారు.

తమిళనాడులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేశారు. ఆ తర్వాత మహిళా భద్రతపై, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా, ఉచిత బస్సు ప్రయాణం తదితర హామీలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు.

శుభాకాంక్షలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సి. జోసెఫ్ విజయ్‌కు శ్రీలంక అధ్యక్షుడు అభినందనలు తెలిపారు. శ్రీలంక, తమిళనాడు మధ్య ఉన్న గాఢమైన చారిత్రక, సాంస్కృతిక మరియు ప్రజల మధ్య సంబంధాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో మరింత బలమైన ఆర్థిక సహకారం మరియు సన్నిహిత భారత్-శ్రీలంక సంబంధాల కోసం ఆశాభావం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Vijay
Tamil Nadu CM
Tamil Nadu Chief Minister
Free Electricity
Rahul Gandhi
Sri Lanka President

More Telugu News