రాష్ట్రంలో వాక్‌స్వాతంత్ర్యంపై దాడి: ఎక్స్ వేదికగా జగన్ విమర్శలు

YS Jagan criticizes attack on freedom of speech in Andhra Pradesh
  • ‘హలో ఇండియా’ అంటూ జగన్ సంచలన ట్వీట్
  • చంద్రబాబు సర్కార్ పోలీసులను వాడుకుంటోందని ఆరోపణ
  • ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శ
  • రాష్ట్రంలో వాక్‌స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని ఆవేదన
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘హలో ఇండియా’ అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన   ఓ పోస్ట్ రాజకీయంగా కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు విభాగాన్ని తన రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ ప్రతిపక్ష గొంతును అణచివేస్తున్నారని జగన్ తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్రంలో వాక్‌స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించిన హక్కుకు భంగం కలిగిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైసీపీ మద్దతుదారులు, పాత్రికేయులు, చివరికి సాధారణ పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

"రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొత్తం పోలీస్‌ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు" అని జగన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించే పోలీసులు, తమ పార్టీ నేతలు ఇచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారి సోషల్ మీడియా ఖాతాలను తొలగించాలని నోటీసులు ఇవ్వడం ద్వారా వ్యవస్థీకృత సెన్సార్‌షిప్‌కు పాల్పడుతున్నారని కూడా జగన్ విమర్శించారు.
 
Go Back to Shorts
YS Jagan Mohan Reddy
Andhra Pradesh
Chandrababu Naidu
YSRCP
freedom of speech
political criticism
police
social media
political vendetta
Article 19

More Telugu News