విజయ్‌కి మద్దతు.. ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ గురించి తెలుసుకోవాలన్న బీజేపీ నేత

  • ఇండియా కూటమి పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న కర్ణాటక బీజేపీ నాయకుడు
  • డీఎంకుకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విమర్శ
  • కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధామంతమంటూ లేదని వ్యాఖ్య
  • డీఎంకేకు ఎదురైన పరిస్థితే మిగిలిన పార్టీలకు రావొచ్చని హెచ్చరిక
డీఎంకేను పక్కన పెట్టి, టీవీకే అధినేత విజయ్‌కి కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వడంపై కర్ణాటక బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ పార్టీ గురించి ఇండియా కూటమి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది. తమిళనాడులో కాంగ్రెస్ తన మిత్రపక్షం డీఎంకేను మోసం చేసిందని ఆరోపించింది. ఈ మేరకు కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ బీజేపీ నేత ఆర్. అశోక్ బెంగళూరు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, డీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి, ఫలితాల తర్వాత ఆ పార్టీని వదిలేసిందని విమర్శించారు.

కాంగ్రెస్ అసలు స్వరూపం మరోసారి బయటపడిందని, ఆ పార్టీని నమ్మిన డీఎంకే నాయకులు ఇప్పుడు దిగ్భ్రాంతికి గురవుతున్నారని అన్నారు. ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే కలిసి పోటీ చేశారని, కానీ ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక స్థిరమైన సిద్ధాంతం ఉండదని విమర్శించారు. టీవీకేతో కలవడమంటే డీఎంకేకు వెన్నుపోటు పొడవడమే అన్నారు.

తమను నమ్మవద్దని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అవసరానికి అనుగుణంగా ఎలా వ్యవహరిస్తుందో ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఆలోచించాలని అన్నారు. డీఎంకేకు ఎదురైన పరిస్థితే మిగిలిన పార్టీలకు ఎదురుకావొచ్చని హెచ్చరించారు.

Vijay Thalapathy
Tamil Nadu
Congress Party
DMK
TVK
India Alliance
R Ashok
Karnataka BJP

More Telugu News