విజయ్ మా పార్టీ మద్దతు కోరారు: ఢిల్లీలో కీలక భేటీ తర్వాత కేసీ వేణుగోపాల్ ప్రకటన

Vijay seeks Congress support to form government KC Venugopal
  • విజయ్ అభ్యర్థనపై చర్చించడానికి ఖర్గే, రాహుల్ గాంధీ, సీనియర్ల సమావేశం
  • సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీ వేణుగోపాల్
  • విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తమిళనాడు యూనిట్‌దేనని స్పష్టీకరణ
తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమ మద్దతును కోరిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం 118. టీవీకే 108 సీట్లు సాధించినప్పటికీ, మరో పదిమంది ఎమ్మెల్యేల అవసరం ఉంది. ఈ క్రమంలో డీఎంకే కూటమిలోని కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు మద్దతును టీవీకే కోరవచ్చనే ప్రచారం జరిగింది.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం మద్దతు కావాలంటూ విజయ్ కాంగ్రెస్ పార్టీని సంప్రదించారని తెలిపారు. అయితే విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూనిట్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు, నిర్ణయం తీసుకోవాల్సిందిగా తమిళనాడు రాష్ట్ర కాంగ్రెస్ కు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. ఒక పార్టీ నిర్ణయం తీసుకోవడానికి ముందు రాజకీయ వ్యూహం, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉండగా, విజయ్ అభ్యర్థనపై చర్చించడానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన నివాసంలో సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, తమిళనాడు పార్టీ ఇన్‌ఛార్జ్ గిరిష్ చోడంగర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం కేసీ వేణుగోపాల్ పైవిధంగా స్పందించారు.
Go Back to Shorts
Vijay
Tamil Nadu
TVK Party
KC Venugopal
Congress Party
Mallikarjun Kharge
Rahul Gandhi

More Telugu News