ప్ర‌ముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెంద‌డం బాధాక‌రం: నారా లోకేష్

RB Choudary Death Condolences from Nara Lokesh
  • ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి కన్నుమూత
  • రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి
  • ఆర్‌బీ చౌదరి మృతికి సంతాపం తెలిపిన నారా లోకేష్
  • ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని వ్యాఖ్య
  • చౌదరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన లోకేష్
ప్రముఖ సినీ నిర్మాత, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆర్‌బీ చౌదరి ఇవాళ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

"ప్ర‌ముఖ నిర్మాత ఆర్‌ బి చౌదరి గారు రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెంద‌డం చాలా బాధాక‌రం. వారి దివ్య‌స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై తెలుగు, త‌మిళ భాష‌ల్లో విజ‌య‌వంత‌మైన చిత్రాలు తీసి ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన చౌద‌రి గారి మృతి చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను" అని నారా లోకేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించి నిర్మాతగా ఆర్‌బీ చౌదరి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
Go Back to Shorts
RB Choudary
Nara Lokesh
Super Good Films
Road Accident
Film Producer
Telugu Cinema
Tamil Cinema
Movie Industry
Producer Death

More Telugu News