ఢిల్లీని ఆదుకున్న రిజ్వీ, స్టబ్స్... సీఎస్కే ముందు ఓ మోస్తరు టార్గెట్
- చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
- ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ క్యాపిటల్స్
- ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వ్వీ ఆదుకోవడంతో మోస్తరు స్కోరు
- చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్‌కు రెండు వికెట్లు
- ఢిల్లీ 20 ఓవర్లలో 155/7.. చెన్నై లక్ష్యం 156 పరుగులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ (40 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (38) కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్ ప్లే ముగిసేసరికి ఓపెనర్లు పతుమ్ నిస్సంక (19), కేఎల్ రాహుల్ (12) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ (13), నితీశ్ రాణా (15), కెప్టెన్ అక్షర్ పటేల్ (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరగడంతో ఢిల్లీ 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 65 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. స్టబ్స్ 31 బంతుల్లో 38 పరుగులు చేయగా, సమీర్ రిజ్వీ కేవలం 24 బంతుల్లో 4 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించగా, అకీల్ హోసేన్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ 156 పరుగులు చేయాల్సి ఉంది.