మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ గతంలో ఓట్ చోరీ చేసే గెలిచారా?: తెలంగాణ బీజేపీ చీఫ్ ప్రశ్న
- ఈ నెల 10న రాష్ట్రానికి వచ్చే మోదీకి స్వాగతం పలకాలన్న బీజేపీ చీఫ్
- ఓట్ చోరీ జరిగిందని మమతా బెనర్జీ అంటే, రాహుల్ సమర్థించడం విడ్డూరమని వ్యాఖ్య
- ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పు సమర్థవంతమైనదన్న రామచందర్ రావు
మమతా బెనర్జీ, రాహుల్ గాంధీలు గతంలో ఓట్ చోరీ చేసే ఎన్నికల్లో గెలిచారా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ, యావత్ ప్రపంచం ఆర్థికమాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రగతి పథంపై పరుగులు పెడుతోందని అన్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోదీకి ప్రజలు ఘన స్వాగతం పలకాలని కోరారు.
బెంగాల్‌లో 100 సీట్లలో ఓటు చోరీ జరిగిందని మమతా బెనర్జీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. వీళ్లకు ఓటు చోరీ అలవాటు కాబట్టే అప్పుడు గెలిచారని చురక అంటించారు. ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల తీర్పును అంగీకరించాలని, కానీ ప్రజలను అవమానపరిచే మాటలు సరికాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు సర్వశక్తిమంతమైనదని అన్నారు.
ప్రజాతీర్పును మమతా బెనర్జీ అవమానిస్తుంటే కాంగ్రెస్ మద్దతు తెలపడం విడ్డూరమని మండిపడ్డారు. మూడుసార్లు మమతా బెనర్జీ గెలిచినప్పుడు తాము ఏమీ అనలేదని, ప్రజాతీర్పును గౌరవించామని అన్నారు. కానీ వాళ్లు ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పుబడుతున్నారని మండిపడ్డారు. ఈసీఐని, దేశాన్ని నిందించడం ఏమిటని రామచందర్ రావు ప్రశ్నించారు.