కృష్ణగారిలాంటి హీరోను నేను చూడలేదు: నటుడు శివకృష్ణ
- కృష్ణగారితో కలిసి నటించానన్న శివకృష్ణ
- కృష్ణగారు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యాఖ్య
- ప్రాజెక్టులు ఆగిపోనిచ్చేవారు కాదని వివరణ
- నిర్మాతలను ఆదుకునేవారని వెల్లడి
- ఎన్టీఆర్ తరువాత భోళా శంకరుడు ఆయనేనన్న శివకృష్ణ
వెండితెరపై ఆవేశపూరితమైన పాత్రలను చేయడంలో శివకృష్ణకి ఒక ప్రత్యేకత ఉంది. ఉద్యమాలు .. తిరుగుబాట్లకి సంబంధించిన కథలలో ఆయన ఎక్కువగా కనిపిస్తూ వచ్చారు. అలాగే విలేజ్ నేపథ్యంలోని సినిమాలలోనూ ఎక్కువగా నటించారు. హీరో కృష్ణతో కలిసి ఆయన అనేక సినిమాలో నటించారు. తాజాగా 'ఐ డ్రీమ్ టీవీ'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కృష్ణను గురించి ప్రస్తావించారు.
"కృష్ణగారు మహానుభావుడు .. ఒక నటుడిగా నేను అంటే ఆయనకి ఎంతో అభిమానం. ఫలానా పాత్ర కోసం శివకృష్ణను తీసుకుందామని ఆయన దగ్గర అంటే, వెంటనే ఒప్పేసుకునేవారు. నాకు కాస్త శ్రమ తగ్గుతుందయ్యా .. మనవాడే .. తీసుకోండి అనేవారు. నేను ఎన్టీఆర్ అభిమానినని ఆయనకి కూడా తెలిసే ఉంటుంది. కానీ ఆ విషయాలను ఆయన ఎప్పుడూ ప్రస్తావించేవారు కాదు. ఎన్టీఆర్ తరువాత భోళా మనిషి ఎవరంటే నేను కృష్ణగారి పేరే చెబుతాను" అని అన్నారు.
"కృష్ణగారు తన సినిమాలు మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు తాను డబ్బులు పెట్టేవారు. మిగతా డబ్బులు ఇవ్వలేమని నిర్మాతలు చెబితే, చాలా తేలికగా 'ఓకే' అని అనేవారు. ఏ నిర్మాతను ఎప్పుడూ ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఎవరికీ కనిపించవు. తాను హామీగా ఉండి సినిమాలను రిలీజ్ చేయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎవరేమనుకున్నా ఫరవాలేదు గానీ, ఆయనలాంటి హీరో మరొకరు లేరు .. ఇది నిజం" అని చెప్పారు.