బెంగాల్ లో ఎంఐఎంకు షాక్.. అన్ని స్థానాల్లో డిపాజిట్ల గల్లంతు

AIMIM Suffers Shock in Bengal All Candidates Lose Deposits
  • పోటీ చేసిన 12 స్థానాల్లోనూ ఎంఐఎంకు ఘోర పరాభవం
  • ఎంఐఎం కొంప ముంచిన హుమయూన్ కబీర్
  • ఒక స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయిన హుమయూన్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంఐఎం పార్టీకి బెంగాల్ ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఈ పార్టీ పోటీ చేసిన 12 స్థానాల్లోనూ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అమ్ జనతా ఉన్నాయున్ పార్టీ నేత హుమయూన్ కబీర్‌తో పొత్తు పెట్టుకుని, బీహార్ ఫార్ములాతో ముస్లిం ఓట్లను చీల్చాలని ఎంఐఎం ప్రయత్నించినప్పటికీ, అది బెంగాల్‌లో ఏమాత్రం పారలేదు. 

ముఖ్యంగా ఒక స్టింగ్‌ ఆపరేషన్‌లో హుమయూన్ కబీర్ దొరికిపోవడం ఎంఐఎం కొంపముంచింది. బీజేపీకి ప్రయోజనం చేకూర్చేందుకే తాము ముస్లిం ఓట్లను చీలుస్తున్నామని ఆయన ఆ ఆపరేషన్‌లో వ్యాఖ్యానించడం మైనారిటీ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ వివాదం తర్వాత ఎంఐఎం ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నప్పటికీ, ఓటర్లు మాత్రం ఎంఐఎంను హుమాయున్ కబీర్ భాగస్వామిగానే పరిగణించి తిరస్కరించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా, బెంగాల్ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలనుకున్న ఎంఐఎం ఆశలు పూర్తిగా అడియాశలయ్యాయి. 
Go Back to Shorts
Asaduddin Owaisi
AIMIM
West Bengal Elections
Humayun Kabir
Bengal Politics
Muslim Vote Bank
Bihar Formula
MIM Bengal
Political Analysis
Assembly Elections 2024

More Telugu News