చర్లపల్లి-అనకాపల్లి మధ్య వీక్లీ స్పెషల్ ట్రైన్

  • చర్లపల్లి - అనకాపల్లి మధ్య కొత్త వీక్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్
  • ప్రతి గురువారం చర్లపల్లి నుంచి అనకాపల్లికి
  • ప్రతి శనివారం అనకాపల్లి నుంచి చర్లపల్లికి ఈ ప్రత్యేక వీక్లీ టైన్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని చర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని అనకాపల్లికి కొత్త వీక్లీ ఏసీ ఎక్స్‌ ప్రెస్ రైలును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది.

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రత్యేక ట్రైన్ ప్రతి గురువారం చర్లపల్లి నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 11 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. తిరిగి శనివారం ఉదయం 6.40 గంటలకు అనకాపల్లిలో బయలుదేరి, అర్ధరాత్రి 12 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.  

 
 
 

Charlapalli Terminal
Anakapalle
Weekly Special Train
South Central Railway
Hyderabad
Andhra Pradesh
AC Express
Train Service
LHB rake
Sridhar CPRO

More Telugu News