తమిళనాట విజయ్ హ‌వా.. త్రిష కల నెరవేరనుందా?.. ఆసక్తి రేపుతున్న బండ్ల గణేశ్ ట్వీట్!

Vijay Thalapathy Victory Trishas Dream to Come True Bandla Ganesh Tweet
  • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీకి అనూహ్య ఆధిక్యం
  • నటి త్రిషకు కంగ్రాట్స్ చెబుతూ బండ్ల గణేష్ ట్వీట్
  • విజయ్‌ను సీఎంగా చూడాలన్నది తన చిరకాల కోరికన్న త్రిష
  • పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర‌ రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నాయి. సినీ నటుడు ‘దళపతి’ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ, తొలి ఎన్నికల్లోనే అనూహ్యమైన రీతిలో విజయపథంలో దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ, మిగ‌తా పార్టీలకు గట్టి షాక్ ఇచ్చింది. ఈ రాజకీయ సంరంభం నడుమ, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.

విజయ్ పార్టీ గెలుపు దిశగా సాగుతున్న తరుణంలో బండ్ల గణేశ్ నటి త్రిషను ట్యాగ్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆ తిరుమల వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది... కంగ్రాట్స్ త్రిష’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.  

గతంలో పలు సంద‌ర్భాల్లో విజయ్ రాజకీయ ప్రవేశాన్ని త్రిష మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది తన చిరకాల కోరిక అని, ఆయన ఆ పదవికి అన్ని విధాలా అర్హుడని ఆమె వ్యాఖ్యానించారు. అంతేగాక‌ దాదాపు 15 ఏళ్ల క్రితం తనకు కూడా ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉందని ఆమె చెప్పిన పాత వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో విజయ్ గెలుపు, త్రిష కల నెరవేరడమేనని బండ్ల గణేశ్ పరోక్షంగా చెప్పారని పలువురు భావిస్తున్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇవాళ‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజే త్రిష పుట్టినరోజు కావడం. ఈ సందర్భంగా ఆమె తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. విజయ్ విజయం కోసమే ఆమె శ్రీవారిని దర్శించుకున్నారని, ఆమె పూజలు ఫలించాయని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ప్రభుత్వం ఏర్పడితే త్రిష ఆ పార్టీలో లేదా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Vijay Thalapathy
Tamil Nadu Elections
Trisha Krishnan
Bandla Ganesh
Tamilaga Vettri Kazhagam
TVK Party
Tamil Politics
Political Entry
Tamil Nadu Assembly
Kollywood

More Telugu News