జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు
- 100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు
- ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు
- నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం
జేఈఈ మెయిన్స్‌లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించి టాపర్లుగా నిలిచిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు నిన్న రాత్రి ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
వివరాల్లోకి వెళ్తే, నారాయణ విద్యాసంస్థల్లో చదివి 100 పర్సంటైల్ సాధించిన మహిత్ ఆంధ్రప్రదేశ్‌లో టాపర్‌గా నిలిచారు. అలాగే తెలంగాణ నుంచి సాయి రిత్విక్‌రెడ్డి, మహేశ్వరి, భవితేష్‌రెడ్డి టాపర్లుగా నిలిచారు. ఈ విద్యార్థులతో పాటు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు కె. పునీత్, గంటా రవితేజ, పి. సింధూర, శరణి కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ తెలుగు విద్యార్థుల ప్రతిభను చాటుతున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని, సిబ్బందిని కూడా ముఖ్యమంత్రి అభినందించారు.