సొంతగడ్డపై సన్‌రైజర్స్ ఇలా ఓడిపోయింది!
- ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్.. హైదరాబాద్ ఓటమి
- ఉప్పల్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కోల్‌కతా
- ట్రావిస్ హెడ్ మెరుపు హాఫ్ సెంచరీ వృథా
- అంగ్క్రిష్ రఘువంశీ కీలక హాఫ్ సెంచరీతో రాణింపు
- మూడు వికెట్లతో సన్‌రైజర్స్‌ను దెబ్బతీసిన వరుణ్ చక్రవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై ఓటమిని చవిచూసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ కాగా, కోల్‌కతా 18.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 61) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిపోయాడు. అయితే, హెడ్ ఔటైన తర్వాత సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (42) కాసేపు నిలబడ్డా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో రైజర్స్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో సన్‌రైజర్స్‌ను దెబ్బ తీయగా, సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు కూడా మంచి ఆరంభం లభించింది. ఫిన్ అలెన్ (29) వేగంగా ఆడగా, కెప్టెన్ అజింక్యా రహానే (43) నిలకడగా రాణించాడు. యువ బ్యాటర్ ఆంగ్క్రిష్ రఘువంశీ (59) కీలక హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. చివర్లో రింకూ సింగ్ (22*) తనదైన శైలిలో మెరుపులు మెరిపించి మరో 10 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్, శివంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్ తలో వికెట్ తీశారు.
కాగా, కోల్ కతా నైట్ రైడర్స్ కు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. అదే సమయంలో వరుసగా 5 విజయాల తర్వాత సన్ రైజర్స్ కు ఇదే తొలి ఓటమి.