అడవి శేష్ 'డెకాయిట్' ఓటీటీలోకి వచ్చేస్తోంది!
- ఓటీటీలోకి వస్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
- ఈ నెల 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
- అడివి శేష్ సరసన హీరోయిన్గా నటించిన మృణాల్ ఠాకూర్
- దర్శకుడితో కలిసి కథ, స్క్రీన్‌ప్లే అందించిన శేష్
- పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే యాక్షన్ లవ్ స్టోరీ
విభిన్నమైన థ్రిల్లర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు అడివి శేష్. ఆయన హీరోగా నటించిన తాజా యాక్షన్ లవ్ స్టోరీ 'డెకాయిట్' (Dacoit). థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 8వ తేదీ నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రంలో అడివి శేష్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. అతుల్ కులకర్ణి, వైభవ్ వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. షనీల్ డియో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడితో కలిసి అడివి శేష్ స్వయంగా ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు.
ఇక సినిమా కథ విషయానికొస్తే, ఓ హత్య కేసులో 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన హరిదాస్ (అడివి శేష్) పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. తనను అన్యాయంగా జైలుకు పంపిన మాజీ ప్రేయసి సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) పై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆమెను వెతికే క్రమంలో అతడికి కొన్ని ఊహించని నిజాలు తెలుస్తాయి. వారిద్దరూ ఎందుకు విడిపోయారు? హరి తన పగను ఎలా తీర్చుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథాంశం. అడివి శేష్ మార్క్ థ్రిల్లింగ్ అంశాలతో పాటు, భావోద్వేగభరితమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఓటీటీ వీక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.