కరీంనగర్‌లో పట్టపగలు కాల్పుల కలకలం.. జ్యువెల్లరీ షాప్‌లో భారీ దొంగతనం

  • నగరంలోని పీఎంజీ జ్యువెల్లరీ దుకాణంలో దొంగతనం
  • తుపాకులతో జ్యువెల్లరీ షాప్‌లోకి ప్రవేశించిన దుండగులు
  • సిబ్బందిపై కాల్పులు జరిపి దొంగతనానికి పాల్పడిన దుండగులు
కరీంనగర్ పట్టణంలో ఓ జ్యువెల్లరీ దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకు దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని పీఎంజీ జ్యువెల్లరీ దుకాణంలోకి తుపాకులతో ఆరుగురు దుండగులు ప్రవేశించారు. జ్యువెల్లరీ దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.

దీంతో ఆ దుండగులు సిబ్బందిపై 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. మిగతా సిబ్బందిని కట్టేసి వెళ్లిపోయారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్‌కు తరలించారు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Karimnagar Robbery
PMG Jewellers
Karimnagar Crime
Jewellery Shop Robbery
Telangana Crime

More Telugu News