హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

Chandrababu Visits Pawan Kalyan in Hyderabad
  • గత కొంతకాలంగా పవన్ కు అనారోగ్య సమస్యలు
  • ఇటీవలే హైదరాబాద్‌లో శస్త్రచికిత్స
  • హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు
  • శస్త్రచికిత్స నేపథ్యంలో తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచన
  • తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పరామర్శించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని పవన్‌కు సూచించారు.

ఈ సందర్భంగా ఇరువురు నేతలు కాసేపు సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై క్లుప్తంగా చర్చించుకున్నట్లు సమాచారం. తన ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు స్వయంగా నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Advertisement
Pawan Kalyan
Chandrababu Naidu
Andhra Pradesh
Deputy CM
Hyderabad
Health Update
Political News
Anna Konidela
Surgery Recovery

More Telugu News