కామారెడ్డి ఎమ్మెల్యేపై షబ్బీర్ అలీ కుమారుడు పరువు నష్టం దావా

Shabbir Alis son files defamation case against Kamareddy MLA
  • తనపై అసత్య ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించారన్న ఇలియాస్
  • ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పరువు నష్టం దావా
  • ఈ నెల 20న హాజరుకావాలంటూ ఎమ్మెల్యేకు సమన్లు
కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కుమారుడు ఇలియాస్ పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగేలా ఎమ్మెల్యే ఆరోపణలు చేశారంటూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దావా వేశారు. దీనితో, ఈ నెల 20న హాజరుకావాలంటూ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.

శనివారం కామారెడ్డిలో హైకోర్టు న్యాయవాది సుమంత్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేకు నోటీసులు జారీ అయినట్లు తెలిపారు. గత ఫిబ్రవరి 17, 21వ తేదీల్లో జరిగిన మీడియా సమావేశాల్లో ఇలియాస్‌పై అత్యాచార కేసులు ఉన్నాయంటూ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. అవాస్తవాలతో తన పరువుకు నష్టం కలిగించారని, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఇలియాస్ కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. దీంతో ఈ నెల 20న హాజరుకావాలని కోర్టు నోటీసులు జారీ చేసిందని అన్నారు.
Go Back to Shorts
Shabbir Ali
Katipally Venkata Ramana Reddy
Iliyas
defamation case
Kamareddy MLA
Telangana politics

More Telugu News