సీపీఐ రామకృష్ణకు మాతృవియోగం.. లోకేశ్ సంతాపం
- సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణకు మాతృవియోగం
- 100 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆయన తల్లి గౌరమ్మ
- కర్నూలు జిల్లాలోని స్వగ్రామంలో తుదిశ్వాస
- రామకృష్ణ కుటుంబానికి నారా లోకేశ్ ప్రగాఢ సానుభూతి
రామకృష్ణ మాతృమూర్తి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రామకృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
"సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారి మాతృమూర్తి గౌరమ్మ గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. ఆమె స్మృతిలో నివాళులు అర్పిస్తూ, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి," అని లోకేశ్ పేర్కొన్నారు.