జైపూర్‌లో ఢిల్లీతో ఢీ: టాస్ నెగ్గిన రాయల్స్... స్టార్క్ పునరాగమనం

  • ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
  • తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ రియాన్ పరాగ్
  • వికెట్ పొడిగా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదించే అవకాశం ఉందని అంచనా
  • మూడు మార్పులతో బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • ఛేజింగ్ చేయడం సంతోషంగా ఉందన్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్
ఐపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోరులో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పిచ్ కాస్త పొడిగా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదించే అవకాశం ఉన్నందున ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నట్లు తెలిపాడు. జట్టులో రవి బిష్ణోయ్, శుభమ్ దూబే తుది జట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు.

మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ, తాము ఛేజింగ్ చేయడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. జట్టులో మూడు మార్పులు చేసినట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ తో మిచెల్ స్టార్క్ పునరాగమనం చేస్తున్నాడు. పతుమ్ నిస్సంక, అశుతోష్ శర్మ కూడా జట్టులోకి రాగా.. డేవిడ్ మిల్లర్‌కు విశ్రాంతినిచ్చినట్లు వివరించాడు. తిరిగి గాడిలో పడాలంటే సానుకూల దృక్పథంతో ఆడటం చాలా ముఖ్యమని పేర్కొన్నాడు.

రాజస్థాన్ రాయల్స్
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డొనోవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ.

ఢిల్లీ క్యాపిటల్స్
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పతుమ్ నిస్సంక, నితీశ్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్:

రాజస్థాన్ రాయల్స్: ఆడమ్ మిల్నే, దసున్ షనక, రవి సింగ్, యశ్ రాజ్ పూంజా, తుషార్ దేశ్‌పాండే.
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, కరుణ్ నాయర్, అభిషేక్ పోరెల్, అకిబ్ నబీ దార్.



Riyan Parag
Rajasthan Royals
Delhi Capitals
IPL 2024
Mitchell Starc
Sawai Mansingh Stadium
Axar Patel
Cricket
T20 League
Jaipur

More Telugu News