హాకీ ప్రాక్టీస్‌లో తీవ్ర విషాదం.. బంతి తగిలి 13 ఏళ్ల బాలిక మృతి
- ప్రాక్టీస్ చేస్తుండగా తలకు బలంగా తగిలిన హాకీ బంతి
- అన్నను చూసి హాకీ ప్లేయర్‌గా మారాలనుకున్న బాలిక
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
గురువారం పాఠశాలలో హాకీ శిక్షణ తీసుకుంటుండగా బంతి తలకు బలంగా తగిలి 13 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. గోవా, గుయిరింలోని సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న రుయీషా ఖర్సెల్ ఈ ఘటనలో మరణించింది.
వేసవి సెలవులకు ముందు పాఠశాల చివరి రోజు కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా హాకీ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జరగబోయే పోటీల కోసం సిద్ధమవుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. శిక్షణలో ఉండగా హాకీ బంతి రుయీషా తలకు తగలడంతో ఆమె మైదానంలోనే కుప్పకూలిపోయింది.
వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసినప్పటికీ, అది రావడానికి సమయం పడుతుందని తెలియడంతో పాఠశాల సిబ్బంది ఓ ప్రైవేట్ వాహనంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక శుక్రవారం వస్తుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్కూల్ సమయంలోనే జరిగిందని ప్రిన్సిపాల్ ఫాదర్ మిల్చెస్టర్ ఫర్టాడో చెప్పారు.
తన సోదరుడు సూరజ్‌ను చూసి స్ఫూర్తి పొందిన రుయీషా రెండేళ్ల క్రితమే హాకీ ఆడటం ప్రారంభించింది. 15 ఏళ్ల సూరజ్ గత నెలలో జరిగిన సబ్-జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో గోవా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. "చెల్లి ఎప్పుడూ నా హాకీ స్టిక్‌నే వాడేది. ప్రాక్టీస్ సెషన్ ముగియడానికి కేవలం పది నిమిషాలు ఉందనగా ఈ ఘోరం జరిగింది" అని సూరజ్ కన్నీటితో చెప్పాడు.
రుయీషా తల్లి ఓ ఇంట్లో పనిమనిషిగా, తండ్రి స్థానిక దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమార్తె మరణవార్తతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. "క్షమించు రుయీషా, నిన్ను కాపాడుకోలేకపోయాను. నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయావు? దయచేసి తిరిగిరా" అంటూ తల్లి గుండెలవిసేలా రోదించడం అక్కడున్న వారిని కదిలించింది.