రేపు కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!

CM Chandrababu will tour in Krishna District tomorrow
  • శుక్రవారం కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
  • పమిడిముక్కలలో 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
  • మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేక ముఖాముఖి
  • గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న చంద్రబాబు
  • ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పింఛన్లు అందించి వారితో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు (మే 1) శుక్రవారం కృష్ణా జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఒకే రోజు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీబిజీగా గడపనున్నారు. 'పేదల సేవలో' కార్యక్రమం, మేడే వేడుకలతో పాటు ఆసుపత్రి ప్రారంభోత్సవం వంటి కీలక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో జరిగే 'పేదల సేవలో' కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారులతో ఆయన ప్రత్యేకంగా ముచ్చటిస్తారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.63,158 కోట్లను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందించింది. ఒక్క కృష్ణా జిల్లాలోనే ప్రతినెలా 2.34 లక్షల మందికి రూ.102 కోట్ల పింఛన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పమిడిముక్కలలోని ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి పింఛను అందించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటారు.

అనంతరం మేడేను పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహిస్తారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత పామర్రు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు
శుక్రవారం ఉదయం 10:15 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి పమిడిముక్కల మండలం వీరంకిలాకు గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:25 గంటలకు పమిడిముక్కల ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:45 గంటలకు భవన నిర్మాణ కార్మికులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 1:55 గంటలకు పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. 

అనంతరం మధ్యాహ్నం 3:40 గంటలకు గుడ్లవల్లేరు చేరుకుని, 3:50 గంటలకు అక్కడ నూతనంగా నిర్మించిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ముగించుకుని సాయంత్రం 4:45 గంటలకు తిరిగి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.
Go Back to Shorts
Chandrababu
Krishna District
May Day
TDP
Andhra Pradesh

More Telugu News