తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ గాయపడిన బీజేపీ ఎమ్మెల్యేను పరామర్శించిన అఖిలేశ్ యాదవ్
- అఖిలేశ్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా ప్రమాదం
- బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌కు తీవ్ర గాయాలు
- ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించిన మాజీ సీఎం
- రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలే ముఖ్యమన్న అఖిలేశ్
- ఎమ్మెల్యే ముఖానికి 75 శాతం కాలిన గాయాలయ్యాయన్న వైద్యులు
లఖ్‌నవూలో ఓ అరుదైన రాజకీయ దృశ్యం చోటుచేసుకుంది. తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ తీవ్రంగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యేను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలకు విలువనిస్తూ ఆయన తీసుకున్న చొరవ ప్రశంసలు అందుకుంటోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'నారీ శక్తి వందన్ అధినియమ్'కు మద్దతుగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలో అఖిలేశ్ యాదవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా మంటలు ఒక్కసారిగా ఎగసిపడి బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ ముఖానికి అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆమెను లఖ్‌నవూలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న అఖిలేశ్ యాదవ్ మంగళవారం ఆసుపత్రికి వెళ్లి అనుపమను, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "సమాజంలో మాకు విద్వేషాల మంటలు వద్దు, సామరస్యం, సద్భావన కావాలి. రాజకీయాలు వాటి స్థానంలో అవి ఉంటాయి, కానీ మానవ సంబంధాలు కూడా అంతే ముఖ్యం" అని పేర్కొన్నారు. అఖిలేశ్ రాకను అనుపమ భర్త అశోక్ జైస్వాల్ ప్రశంసించారు. ఇది ప్రజాస్వామ్య మర్యాదకు, మానవతా సున్నితత్వానికి నిదర్శనమని కొనియాడారు.
మరోవైపు, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు బ్రజేశ్ పాఠక్, కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా ఆసుపత్రికి వెళ్లి అనుపమను పరామర్శించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫోన్‌లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అనుపమ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆమె ముఖంపై 75 శాతం, చెవి, నుదుటి భాగంలో 60 శాతం కాలిన గాయాలయ్యాయని, కంటికి కూడా పాక్షికంగా గాయమైనట్టు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు వారు వెల్లడించారు.