హైదరాబాదులో పాస్ పోర్ట్ మెగా మేళా... ఎప్పుడంటే...!
- పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం మే 9న ప్రత్యేక మేళా
- హైదరాబాద్ రీజియన్‌లో 4,000 అదనపు స్లాట్ల విడుదల
- 8-10 రోజుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యం
- మే 4 నుంచి కరీంనగర్ పీఎస్‌కే సామర్థ్యం పెంపు
హైదరాబాద్ పరిధిలోని బేగంపేట, ఎంజీబీఎస్ మెట్రో, రాయదుర్గం పీఎస్‌కేలకు 3,100 స్లాట్లు, కరీంనగర్, నిజామాబాద్ పీఎస్‌కేలకు 900 స్లాట్లు కేటాయించారు. ఈ అదనపు స్లాట్లు తత్కాల్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) సేవలకు వర్తించవని స్పష్టం చేశారు. ప్రస్తుతం 8 నుంచి 10 రోజులుగా ఉన్న అపాయింట్‌మెంట్ నిరీక్షణ కాలాన్ని 5 నుంచి 7 రోజులకు తగ్గించడమే ఈ మేళా ముఖ్య ఉద్దేశమని స్నేహజ వివరించారు.
సేవల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా, మే 4 నుంచి కరీంనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (పీఎస్‌కే) రోజువారీ అపాయింట్‌మెంట్ల సామర్థ్యాన్ని 220 నుంచి 400కి పెంచుతున్నట్లు ఆమె తెలిపారు. దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ passportindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్లను బుక్ చేసుకోవాలని సూచించారు.