పటియాలా రైల్వే ట్రాక్‌ను పేల్చేందుకు ప్రయత్నించి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

  • సోమవారం రాత్రి రైల్వే ట్రాక్‌పై పేలుడు
  • ఘటన ప్రాంతంలోనే ఛిద్రమైన స్థితిలో మృతదేహం
  • రైల్వే ట్రాక్ పేల్చే ప్రయత్నంలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడి
సోమవారం రాత్రి పటియాలా జిల్లాలోని రాజ్‌పురా ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. శంబు-అంబాలా రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ ఘటన కుట్రపూరిత యత్నమని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఛిద్రమైన స్థితిలో గుర్తించిన మృతదేహం పేలుడుకు యత్నించిన వ్యక్తిదని తెలిపారు. ఈ ఘటనలోనే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.

స్పందించిన మంత్రి

పటియాలాలోని రైల్వే ట్రాక్‌పై జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ మంత్రి హర్బాల్ సింగ్ హామీ ఇచ్చారు. పోలీసులు, నిఘా సంస్థలు ఈ పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

శంభు-అంబాల రైల్వే ట్రాక్‌ను సరుకు రవాణాకు కేటాయించారు. దాని సమీపంలో పేలుడు జరిగిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత తక్కువ తీవ్రత గల పేలుడని అధికారులు భావించినప్పటికీ, అది కుట్రపూరిత యత్నమని దర్యాప్తులో గుర్తించారు. ఘటనా స్థలంలో ఒక సిమ్ కార్డును స్వాధీనం చేసుకున్నట్లు పటియాలా పోలీసు ఉన్నతాధికారి వరుణ్ శర్మ వెల్లడించారు. ఇతర ఆధారాలను సేకరించామని, త్వరలో ఈ కుట్రను ఛేదిస్తామని అన్నారు.

Patiala Railway Track Blast
Rajpura
Shambu Ambala Railway Track
Punjab Minister Harpal Singh
Railway Track Explosion

More Telugu News