ఓటీటీలో దూసుకుపోతున్న 'వశీకరణం'

Vashikaranam Series Update
  • హిందీ సిరీస్ గా రూపొందిన 'వశీకరణం'
  • అందుబాటులోకి వచ్చిన 30 ఎపిసోడ్లు 
  • ప్రధానమైన పాత్రలో స్నేహలత వసైకర్ 
  • ఆకట్టుకుంటున్న కంటెంట్
  • మెప్పిస్తున్న ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం    

క్షుద్ర శక్తులకు సంబంధించిన కంటెంట్ పట్ల కుతూహలాన్ని కనబరిచే ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దెయ్యలకి సంబంధించిన హారర్ థ్రిల్లర్ సినిమాల తరువాత, ఈ తరహా కంటెంట్ పట్ల ఆసక్తిని చూపించేవారి శాతం ఎక్కువే. భయపడుతూ చూడటంలోనే థ్రిల్ ఫీలవుతూ ఉంటారు. అందువల్లనే ఈ తరహా కథలు ఓటీటీ సెంటర్లలోకి వరుసగా దిగిపోతున్నాయి. అలా 'సోనీ లివ్' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన హిందీ సిరీస్ గా 'వశీకరణం : కిస్ పర్ రఖే విశ్వాస్' కనిపిస్తుంది.  

 మార్చి 16వ తేదీ నుంచి ఈ సిరీస్ నుంచి ఎపిసోడ్స్ వదులుతూ వస్తున్నారు. ప్రతి సోమ వారం నుంచి శుక్రవారం వరకూ అందుబాటులోకి వస్తున్న కొత్త ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ దూసుకుపోతోంది. ఇంతవరకూ ఈ సిరీస్ నుంచి 30 ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. స్నేహలత వసైకర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, ప్రస్తుతం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహారాష్ట్ర ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో సుమన్ అనే శ్రీమంతురాలు ఉంటుంది. ఆ ఇంట్లో పెత్తనమంతా ఆమెదే. ఆమె కనుసైగలలోనే అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. ఆమెకి ఎదురు మాట్లాడటానికి పనివాళ్లెవరూ సాహసించరు. ఆమెకి వశీకరణ విద్యలో ప్రవేశం ఉంటుంది. అందువలన పౌర్ణమి రోజులలో రహస్యంగా ఆమె ఆ తాంత్రిక విద్యను ప్రయోగిస్తూ ఉంటుంది. ఒక వ్యవసాయ కూలీ తల్లి ఈ విషయాన్ని బయటికి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. భారీతనం .. నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ ఈ సిరీస్ ప్రధానమైన బలంగా నిలిచాయి. 

Go Back to Shorts
Vasakaranam
Vasakaranam series
Sony Liv
horror thriller
Snehalata Vasaikar
OTT series
Hindi series
Telugu dubbed
supernatural powers
indian horror series

More Telugu News