ఇన్ఫోసిస్ కు 20 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం
- విశాఖలో ఇన్ఫోసిస్ కు 20 ఎకరాల కేటాయింపు
- రూ. 750 కోట్లతో క్యాంపస్ ను విస్తరించనున్న ఇన్ఫోసిస్
- 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ పటంలో అగ్రస్థానంలో నిలిపే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు విశాఖపట్నంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 750 కోట్ల భారీ పెట్టుబడితో ఇన్ఫోసిస్ తన కేంపస్‌ను ఇక్కడ విస్తరించనుంది.