ఉప రాష్ట్రపతికి విశాఖలో ఘన స్వాగతం.. కాసేపట్లో ఏయూకు ఉప రాష్ట్రపతి, చంద్రబాబు

  • ఆంధ్ర యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి
  • కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, నారా లోకేశ్
  • రేపు గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన

భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఏపీ పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్ అబ్దుల్ నజీర్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘనస్వాగతం పలికారు.


శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి, శ్రీకూర్మనాథ స్వామి ఆలయాలను ఉపరాష్ట్రపతి దర్శించుకున్నారు. తిరిగి విశాఖ చేరుకున్న అనంతరం, ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్ఠాత్మక శతాబ్ది ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కూడా పాల్గొంటారు.

మరోవైపు, ఏపీ ఐటీ రంగానికి ఊతమిచ్చేలా, విశాఖలో సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించనున్న ‘హైపర్ స్కేల్ గూగుల్ డేటా సెంటర్’కు రేపు (ఏప్రిల్ 28) సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు నిర్వహించనున్న ‘భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్’లో మంత్రి లోకేశ్ ప్రసంగించనున్నారు.

Radha Krishnan
Vizag
Chandra Babu
Nara Lokesh
Telugu Desam

More Telugu News