భర్త సోదరినే రెండో భార్యగా చూపి.. కోర్టును మోసం చేసి విడాకులు!
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసిన కేసు
- ఫ్యామిలీ ఫొటోను కోర్టుకు సమర్పించి తప్పుదోవ పట్టించిన వైనం
- విషయం తెలిసి హైకోర్టును ఆశ్రయించిన భర్త
- ఆమె వాదనను నమ్మి ఏకపక్షంగా విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు
విడాకులు పొందేందుకు ఓ భార్య వేసిన పక్కా ప్లాన్ కోర్టునే విస్మయానికి గురిచేసింది. ఏకంగా తన భర్త సొంత చెల్లెలినే అతడి రెండో భార్యగా చిత్రీకరించి, ఫ్యామిలీ కోర్టును తప్పుదోవ పట్టించి ఏకపక్షంగా విడాకులు పొందింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఈ విచిత్ర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయం తెలుసుకున్న భర్త, తనకు అన్యాయంగా మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌కు చెందిన 40 ఏళ్ల మహిళకు 1998లో వివాహం జరిగింది. మార్కెటింగ్ కంపెనీలో పనిచేసే భర్త ఉద్యోగరీత్యా తరచూ బయట ప్రాంతాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో 2015 నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అయితే, విడాకులు ఇచ్చేందుకు భర్త నిరాకరించాడు.
దీంతో 2021లో సదరు మహిళ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని, అందుకే తనకు విడాకులు కావాలని పిటిషన్ వేసింది. ఇందుకు సాక్ష్యంగా భర్త తన సోదరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఓ ఫ్యామిలీ ఫొటోను కోర్టుకు సమర్పించింది. అందులో ఉన్న తన ఆడపడుచునే భర్త రెండో భార్యగా చెప్పి కోర్టును నమ్మించింది. ఆమె సమర్పించిన ఆధారాలపై ఆధారపడిన ఫ్యామిలీ కోర్టు, ఆమెకు అనుకూలంగా ఏకపక్ష విడాకుల డిక్రీని మంజూరు చేసింది.
ఈ నెల ఏప్రిల్ మొదటి వారంలో ఈ విషయం తెలుసుకున్న భర్త షాక్‌కు గురయ్యాడు. కోర్టు రికార్డులను పరిశీలించగా, తన భార్య చేసిన మోసం బయటపడింది. దీంతో ఆమె కోర్టును తప్పుదోవ పట్టించి అక్రమంగా విడాకులు పొందిందని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన గ్వాలియర్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.