విష్ణుప్రియతో పెళ్లి వార్తలపై జేడీ చక్రవర్తి క్లారిటీ.. ఆమె నా శిష్యురాలు మాత్రమే!
- విష్ణుప్రియతో పెళ్లి వార్తలను ఖండించిన జేడీ చక్రవర్తి
- ఆమె తన ప్రియ శిష్యురాలు మాత్రమేనని స్పష్టీకరణ
- తమ మధ్య ఉన్నది గురుశిష్యుల బంధం మాత్రమేనని వెల్లడి
- గతంలో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలతో మొదలైన ప్రచారం
టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి, యాంకర్ విష్ణుప్రియ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జేడీ చక్రవర్తి స్పందించారు. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు. విష్ణుప్రియ తనకు కేవలం ఒక ప్రియ శిష్యురాలు మాత్రమేనని, తమ మధ్య అంతకు మించిన సంబంధం లేదని స్పష్టం చేశారు.
తన తాజా చిత్రం 'గాయపడ్డ సింహం' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "విష్ణుప్రియ నా శిష్యురాలు. ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు 'గురువుగారు' అనే మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయికి, నాకు ఎఫైర్ ఉందని ప్రచారం చేయడం కంటే దుర్మార్గం మరొకటి లేదు. మాది పవిత్రమైన గురుశిష్యుల బంధం" అని జేడీ చక్రవర్తి వివరించారు. దాదాపు మూడేళ్లుగా తాను విష్ణుప్రియను కలవలేదని కూడా ఆయన తెలిపారు.
గతంలో ఓ టీవీ షోలో విష్ణుప్రియ మాట్లాడుతూ.. జేడీ చక్రవర్తి అంటే తనకు ఇష్టమని, ఆయన తల్లి అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటానని సరదాగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను పట్టుకొని సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. అయితే, ఆ తర్వాత విష్ణుప్రియ కూడా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన దృష్టి అంతా కెరీర్‌పైనే ఉందని స్పష్టం చేశారు. తాజాగా జేడీ చక్రవర్తి ఇచ్చిన ఈ స్పష్టతతో ఈ పెళ్లి పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది.