నష్టాలు తగ్గించుకునేందుకు... తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం

Tamil Film Producers Council Decides on Revenue Sharing to Reduce Losses
  • ఇకపై రెమ్యునరేషన్ కాదు.. లాభనష్టాల్లో వాటా
  • తమిళ చిత్ర నిర్మాతల మండలి సంచలన తీర్మానం
  • మే 2న చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపు
  • నటీనటుల సంఘం సహకరించకుంటే నిరవధిక సమ్మెకు హెచ్చరిక
తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. భారీ, మధ్యస్థ బడ్జెట్ చిత్రాలకు పనిచేసే నటీనటులు, కీలక సాంకేతిక నిపుణులకు ఇకపై స్థిరమైన పారితోషికం (ఫిక్స్‌ డ్ రెమ్యునరేషన్) బదులుగా లాభనష్టాల్లో వాటా (రెవెన్యూ షేరింగ్) ఇవ్వాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) ఏకగ్రీవంగా తీర్మానించింది. థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ హక్కుల ద్వారా ఆదాయం తగ్గిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారని, వారిని ఆదుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మండలి స్పష్టం చేసింది.

నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ కొత్త విధానానికి నటీనటుల సంఘం (నడిగర్ సంగం) సహకరించాలని కోరారు. తమ నిర్ణయానికి మద్దతుగా మే 2న ఒకరోజు పాటు చిత్ర పరిశ్రమలో షూటింగులు, ఇతర పనులు నిలిపివేస్తూ టోకెన్ స్ట్రైక్‌కు పిలుపునిచ్చారు. నడిగర్ సంగం చర్చలకు రాకపోతే, నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమని నిర్మాతల మండలి హెచ్చరించింది.
 
 
 
Go Back to Shorts
Tamil Film Producers Council
Tamil cinema
TFPC
Kollywood
Revenue sharing
Fixed remuneration
Nadigar Sangam
Movie production
Tamil movie industry
Film industry strike

More Telugu News