ఐపీఎల్‌లో సంజూ శాంసన్ సరికొత్త రికార్డ్
- ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తిచేసిన సంజూ శాంసన్
- అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డ్
- గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు
- ఈ ఘనత సాధించిన 10వ బ్యాటర్‌గా నిలిచిన సంజూ
- ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేశాడు
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లో కగిసో రబాడ బౌలింగ్‌లో ఫోర్ కొట్టడం ద్వారా సంజూ 5000 పరుగుల మార్కును దాటాడు. అయితే, కాసేపటికే నాలుగో ఓవర్‌లో అదే రబడ బౌలింగ్‌లో 11 పరుగుల వద్ద ఔటయ్యాడు.
కాగా, ఈ ఘనతను కేవలం 3555 బంతుల్లోనే సాధించి, అత్యంత వేగవంతమైన భారత బ్యాటర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 5000 పరుగులు పూర్తి చేసిన 10వ బ్యాటర్ అతడే. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా వంటి దిగ్గజాలు ఉన్నారు.
2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 31 ఏళ్ల సంజూ, ఇప్పటివరకు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఆ ఫ్రాంచైజీ తరఫున 4,000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగానూ గత సీజన్‌లో నిలిచాడు.
సంజూ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 2024 సీజన్‌లో 531 పరుగులు సాధించి కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ప్రస్తుత 2026 సీజన్‌లో కూడా 8 మ్యాచ్‌ల్లో 50.67 సగటుతో 304 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండటం విశేషం. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 5 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు నమోదు చేశాడు.