కెప్టెన్ చలవతో ఓ మోస్తరు స్కోరు చేసిన సీఎస్కే
- గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో తడబడిన చెన్నై సూపర్ కింగ్స్
- కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత అర్ధశతకంతో ఆదుకున్న వైనం
- ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన గైక్వాడ్
- నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసిన సీఎస్కే
- గుజరాత్ బౌలర్లలో మూడు వికెట్లతో రాణించిన కగిసో రబాడా
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మోస్తరు స్కోరు సాధించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74 నాటౌట్; 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఒంటరి పోరాటం చేయడంతో, సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇతర బ్యాటర్లు విఫలమైన చోట, గైక్వాడ్ బాధ్యతాయుతమైన ఆటతీరుతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయానికి తగ్గట్లే గుజరాత్ బౌలర్లు చెలరేగారు. చెన్నై ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. సంజూ శాంసన్ (11), ఉర్విల్ పటేల్ (4), సర్ఫరాజ్ ఖాన్ (0), డివాల్డ్ బ్రెవిస్ (2) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీంతో సీఎస్కే 37 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ క్లిష్ట సమయంలో క్రీజులో నిలబడ్డ కెప్టెన్ గైక్వాడ్, శివమ్ దూబే (22)తో కలిసి ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దూబే ఔటయ్యాక, కార్తీక్ శర్మ (15), జేమీ ఓవర్టన్ (18) చివర్లో వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. గైక్వాడ్ ఒకవైపు వికెట్లు పడుతున్నా సంయమనంతో ఆడుతూ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో కగిసో రబాడ 3 వికెట్లతో రాణించగా, అర్షద్ ఖాన్ 2, మహ్మద్ సిరాజ్, మానవ్ సుతార్ తలో వికెట్ పడగొట్టారు.