ఒకవైపు కేసు.. మరోవైపు అషు రెడ్డి వార్నింగ్.. అసలేం జరిగింది?

Ashu Reddy Faces Fraud Case and Denies Allegations
  • బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డిపై రూ. 9.35 కోట్ల మోసం కేసు
  • ప్రేమ, పెళ్లి పేరుతో డబ్బు, బంగారం కాజేశారని ఫిర్యాదు
  • ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి
  • తప్పుడు ప్రచారంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరిక
బిగ్‌బాస్ ఫేమ్, సోషల్ మీడియా స్టార్ అషు రెడ్డిపై భారీ మోసం కేసు నమోదు కావడం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువకుడి నుంచి రూ. 9.35 కోట్లతో పాటు కిలోల కొద్దీ బంగారం కాజేశారని ఆరోపణలు రావడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అషు రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఘాటుగా స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని, వాటిలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. తన అనుమతి లేకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు.

"నా గురించి అసత్యాలు ప్రచారం చేసే ఏ ఛానెల్ పైనైనా చట్టపరంగా ముందుకెళ్తాను" అని అషు రెడ్డి తన పోస్టులో స్పష్టం చేశారు. ఒకవైపు బాధితుడి తండ్రి పక్కా ఆధారాలతోనే పోలీసులను ఆశ్రయించామని చెబుతుండగా, మరోవైపు అషు రెడ్డి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ కేసులో అసలు వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Go Back to Shorts
Ashu Reddy
Ashu Reddy fraud case
Bigg Boss Ashu Reddy
Hyderabad CCS police
Social media influencer
Telugu news
Fraud allegations
Cyber crime
Legal action
Gold scam

More Telugu News