ఇషాన్, అభిషేక్ విధ్వంసం... రాజస్థాన్ పై సన్‌రైజర్స్ సంచలన విజయం
- రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్
- వైభవ్ సూర్యవంశీ విధ్వంసక శతకంతో రాజస్థాన్ భారీ స్కోర్
- భారీ లక్ష్య ఛేదనలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకాలు
- 18.3 ఓవర్లలోనే 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారించిన మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. తొలుత రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (103) విధ్వంసక శతకంతో చెలరేగగా, రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం సన్‌రైజర్స్ బ్యాటర్లు ఇషాన్ కిషన్ (74), అభిషేక్ శర్మ (57) మెరుపు అర్ధశతకాలతో లక్ష్యాన్ని చిన్నదిగా మార్చేశారు. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
229 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ (6) వికెట్ కోల్పోయి షాక్ తగిలింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ రాజస్థాన్ బౌలర్లను ఊచకోత కోశారు. పవర్ ప్లే ఓవర్లను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అభిషేక్ శర్మ 29 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు కేవలం 55 బంతుల్లోనే 132 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేసింది.
వీరిద్దరూ ఔటయ్యాక, హెన్రిచ్ క్లాసెన్ (29), నితీష్ కుమార్ రెడ్డి (18 బంతుల్లో 36) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు. చివరి ఓవర్లలో ఒత్తిడి పెరిగినా, సలీల్ అరోరా (3 బంతుల్లో 8 నాటౌట్) ఒక సిక్సర్ కొట్టి మరో 9 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. వైభవ్ అద్భుత శతకం వృథాగా మిగిలింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (10) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 5 ఫోర్లు, ఏకంగా 12 సిక్సర్లతో 103 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. అతనికి మరో ఎండ్‌లో ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 51) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
చివర్లో డొనోవన్ ఫెరీరా (16 బంతుల్లో 33) కూడా మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ భారీ స్కోరు నమోదు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో కమిన్స్ పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయగా, ఇషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు.