36 బంతుల్లో సూర్యవంశీ సెంచరీ.. సన్‌రైజర్స్ ముందు కొండంత లక్ష్యం
- జైపూర్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీ
- 37 బంతుల్లో 12 సిక్సర్లతో 103 పరుగులు
- హాఫ్ సెంచరీతో రాణించిన ధ్రువ్ జురెల్
- సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 229 పరుగుల భారీ లక్ష్యం
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వర్షం కొనసాగుతోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 37 బంతుల్లోనే 12 భారీ సిక్సర్లు, 5 ఫోర్లతో 103 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. దాంతో, రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, అతని నిర్ణయం బెడిసికొట్టింది. యశస్వి జైస్వాల్ (10) త్వరగానే వెనుదిరిగినా, మరో ఓపెనర్ సూర్యవంశీ సన్‌రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి ఓవర్లోనే వరుసగా 4 సిక్స్ లు కొట్టి ప్రమాద సంకేతాలు పంపాడు. ఈ క్రమంలో, కేవలం 36 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ సీజన్ లో తన బెస్ట్ స్కోరు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. అతనికి ధ్రువ్ జురెల్ (35 బంతుల్లో 51) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 62 బంతుల్లో 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
చివర్లో డొనోవన్ ఫెరీరా (16 బంతుల్లో 33) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ స్కోరు 220 పరుగులు దాటింది. సన్‌రైజర్స్ బౌలర్లలో షకీబ్ హుస్సేన్ 4 ఓవర్లలో 62 పరుగులు సమర్పించుకుని అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. పాట్ కమిన్స్ (1/27) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. కొండంత లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఎలా రాణిస్తారో చూడాలి.