రాఘవ్ చద్దాకు 24 గంటల్లో 10 లక్షల మంది ఫాలోవర్లు తగ్గారు!

  • ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు నిన్న ప్రకటన 
  • ఇన్‌స్టాగ్రామ్‌‌లో నిన్న 14.6 మిలియన్ల మంది ఫాలోవర్లు
  • ఈరోజు మధ్యాహ్నానికి 13.5 మిలియన్లకు పడిపోయిన ఫాలోవర్లు
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరతానని ప్రకటించడం ద్వారా రాఘవ్ చద్దా జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. అయితే ఈ ప్రకటన తర్వాత ఆయనకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు తగ్గిపోయారు. పార్టీ మారుతున్నట్లు ఆయన ప్రకటించిన 24 గంటల్లో సోషల్ మీడియాలో ఆయన ఫాలోయింగ్ తగ్గిపోయింది.

రాఘవ్ చద్దాకు నిన్నటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 14.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఈరోజు మధ్యాహ్నానికి ఆ సంఖ్య 13.5 మిలియన్లకు తగ్గింది. ఇటీవల లోక్ సభలో ఆయన సంధించిన ప్రశ్నలతో ఫాలోవర్ల సంఖ్య పెరిగింది. కానీ గత ఇరవై నాలుగు గంటల్లో మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయింది.

రాఘవ్ చద్దాకు 24 గంటల్లో 10 లక్షల మంది ఫాలోవర్లు తగ్గిపోవడంపై ఎన్సీపీ(శరద్ పవార్) అధికార ప్రతినిధి అనీశ్ గవాండే స్పందించారు. ఇంటర్నెట్ మిమ్మల్ని రాత్రికి రాత్రే హీరోగా మార్చగలదు, అలాగే రాత్రికి రాత్రే మిమ్మల్ని సున్నాకు కూడా పడేయగలదని ట్వీట్ చేశారు.

Raghav Chadha
Aam Aadmi Party
BJP
Social Media Followers
Instagram
Political Defection
Anish Gawande

More Telugu News