బీఆర్ఎస్ పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించిన కవిత

Telangana
Advertisement
  • బీఆర్ఎస్ పార్టీ పేరుతో పాటు ఆత్మను కూడా మార్చుకుందని విమర్శ
  • మూల సిద్ధాంతం నుంచి తప్పుకుంటే పార్టీ మనుగడ సాగించలేదన్న కవిత
  • తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయన్న కవిత
Advertisement
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం పాతిక సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పుట్టిందని, కానీ గత కొన్నేళ్లుగా ఆ పార్టీ తన పేరుతో పాటు పనితీరును, పార్టీ ఆత్మను కూడా మార్చుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. రేపు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు.

పేరు మార్పు మొదలు ప్రతి విషయంలో టీఆర్ఎస్ మారిందని, దీనితో ఆ పార్టీకి ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రాథమిక ఉద్దేశం, మూల సిద్ధాంతం నుంచి పక్కకు తప్పుకుంటే ఆ పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని అన్నారు. బీఆర్ఎస్ తన ప్రాథమిక ఉద్దేశం నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ఆ పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

ప్రభుత్వం మారినా తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయని అన్నారు. వీటిని సాధించడమే తాను ప్రారంభించబోయే పార్టీ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ప్రజల కోసం పని చేసే స్వచ్ఛమైన ప్రాంతీయ పార్టీ అవసరం ఇప్పుడు తెలంగాణకు ఉందని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Kavitha fires at BRSKavitha takes on BRS

More Telugu News

పురపోరులో జనసేన ప్రభంజనం.. మరోసారి 100% స్ట్రైక్‌రేట్‌!

04 Nov, 09:04

కొత్త 'రామాయణ'పై పాత లక్ష్మణుడి ప్రశంసలు.. కానీ..

04 Nov, 08:48

కుప్పం కోటపై టీడీపీ జెండా.. 32 వార్డులూ క్లీన్ స్వీప్

04 Nov, 08:43

జైపూర్‌ హోటల్‌లో విదేశీయులకు అక్రమ ఆశ్రయం.. నిర్వాహకుడిపై కేసు నమోదు

04 Nov, 08:41

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. సత్తా చాటుతున్న భారత సంతతి అభ్యర్థులు

04 Nov, 08:25

కివీస్‌తో తొలి వన్డేలో టాస్ గెలిచిన కెప్టెన్ గిల్.. యువ పేస్ దళంతో బరిలోకి భార‌త్‌!

04 Nov, 08:09

సోషల్ మీడియాలో కాదు.. దమ్ముంటే సభలో చర్చకు రండి: రాహుల్‌కు నిర్మల సవాల్

04 Nov, 08:02

ఎన్టీఆర్ 'డ్రాగన్'కు రవి బస్రూర్ సంగీతం.. అధికారికంగా ప్రకటించిన ప్రశాంత్ నీల్

04 Nov, 07:47

ట్రంప్‌కు సవాలు విసురుతున్న జోన్ ఓసోఫ్.. జార్జియా నుంచి మళ్లీ గెలుపు!

04 Nov, 07:45

మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు షాక్.. ఆధిక్యంలో డెమోక్రాట్లు!

04 Nov, 07:12

పట్టభద్రులకు ఊరట: తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పొడిగింపు

04 Nov, 06:45

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా ఘన విజయం

04 Nov, 06:44

డ్రైవర్ అప్రమత్తత... పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థులు

04 Nov, 06:21

కడప, విజయనగరం కార్పొరేషన్లు టీడీపీ కైవసం.. కూటమి క్లీన్ స్వీప్

04 Nov, 06:17

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53
..More Telugu News