బీజేపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి

  • హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చిన ప్రీతిరెడ్డి
  • పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ
  • కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీని కలిసిన మల్లారెడ్డి కుటుంబం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వచ్చే నెలలో తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో సుమారు లక్ష మందితో నిర్వహించతలపెట్టిన 'వందేమాతరం' ఆలాపన కార్యక్రమానికి సంబంధించి చర్చించే అంశంపై ఆమె బీజేపీ కార్యాలయానికి వచ్చారని తెలుస్తోంది.

ఇటీవల తన కుటుంబంతో కలిసి మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన కోడలు బీజేపీ కార్యాలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రీతిరెడ్డి రెండు రోజుల క్రితం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కూడా సమావేశమయ్యారు.

Malla Reddy
Preeti Reddy
BRS
BJP
Telangana BJP
Chandrashekhar Tiwari
Vande Mataram
Ramachander Rao

More Telugu News