నేను మలయాళీని కాదు.. తమిళ అమ్మాయిని: పాత వివాదంపై సాయి పల్లవి

  • తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారని గతంలో సాయి పల్లవికి ప్రశ్న
  • తాను తమిళ అమ్మాయిని అని తెలిపిన పల్లవి
  • ఆమె మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసిన కొందరు వ్యక్తులు
  • తన మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పానన్న పల్లవి
  • ఏ భాషను తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని వ్యాఖ్య

టాలెంట్, సహజమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సాయి పల్లవి, ప్రస్తుతం బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ సరసన ‘రామాయణ’ చిత్రంలో సీతగా నటిస్తూ బిజీగా ఉంది. అయితే, కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా, గతంలో తాను చేసిన ఒక వ్యాఖ్యను కొందరు వక్రీకరించడంపై తాజాగా ఆమె స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.


అసలు ఏం జరిగిందంటే... దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక ప్రెస్ మీట్‌లో, "మీరు మలయాళీలు అయి ఉండి తమిళం ఇంత బాగా ఎలా మాట్లాడుతున్నారు?" అని ఒక రిపోర్టర్ ప్రశ్నించారు. దానికి సాయి పల్లవి సమాధానమిస్తూ, "నేను తమిళ అమ్మాయిని, మలయాళీని కాదు" అని స్పష్టం చేసింది. అయితే, రెండేళ్ల తర్వాత కొందరు ఈ మాటలను వక్రీకరించి, "మలయాళీ అని పిలిచినందుకు సాయి పల్లవికి కోపం వచ్చింది" అంటూ తప్పుడు ప్రచారం చేశారు.


ఈ ప్రచారంపై తాజాగా ఆమె స్పందిస్తూ.. "ఆ హెడ్‌లైన్ చూసి నేను షాక్‌కు గురయ్యాను. నేను అనని మాటలను నాపై మోపడం బాధాకరం. నేను కోయంబత్తూరులో పుట్టి పెరిగాను, నా మాతృభాష తమిళం అని మాత్రమే చెప్పాను. ఏ భాషను తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు" అని సాయి పల్లవి వివరణ ఇచ్చింది.


Sai Pallavi
tollwood
kollywood

More Telugu News