పవన్ కల్యాణ్ గారూ... మీరు త్వరగా కోలుకోవాలి: జగన్

  • శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించిన జగన్
  • సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ సీఎం
  • హైదరాబాద్‌లో పవన్‌కు విజయవంతంగా ముగిసిన సర్జరీ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. పవన్ త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పవన్ కల్యాణ్ కు నిన్న హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీ విజయవంతం అయిందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిసింది. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ కూడా స్పందించారు. "పవన్ కల్యాణ్ గారు శస్త్రచికిత్స అనంతరం త్వరగా, సంపూర్ణంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని తన పోస్టులో జగన్ పేర్కొన్నారు. 

Pawan Kalyan
Jagan
Pawan Kalyan health
Janasena
YS Jagan Mohan Reddy
Andhra Pradesh politics
Pawan Kalyan surgery
Political news Andhra Pradesh
Telugu cinema news

More Telugu News