నా మాటలను వక్రీకరించారు.. నేను అలాంటి వాడిని కాదు: ప్రకాశ్ రాజ్

  • రామాయణంపై తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ప్రకాశ్‌ రాజ్
  • కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
  • తాను హిందూ వ్యతిరేకిని కాదని, అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టీకరణ
  • ప్రశ్నలకు బదులివ్వలేకే కొందరు నేతలు ఈ ముద్ర వేస్తున్నారని విమర్శ
రామాయణం, హిందూ ధర్మంపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నటుడు ప్రకాశ్‌ రాజ్ స్పందించారు. తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

ఇటీవల ఓ సాహితీ కార్యక్రమంలో తాను చేసిన పూర్తి ప్రసంగాన్ని వదిలేసి, అందులోని కొన్ని భాగాలను మాత్రమే తీసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రకాశ్‌ రాజ్ పేర్కొన్నారు. తాను శ్రీరాముడిని కించపరిచానని, హిందువుల మనోభావాలను దెబ్బతీశానని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను అన్ని ధర్మాలను సమానంగా గౌరవిస్తానని, ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని తెలిపారు.

సమాజంలోని లోపాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కొందరు రాజకీయ నాయకులు ‘హిందూ వ్యతిరేకి’ అనే ముద్ర వేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే తన గొంతు నొక్కేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం తాను పొలం పనులతో తీరిక లేకుండా ఉన్నానని, ఆ పనులు పూర్తయ్యాక ఈ విషయంపై మరింతగా మాట్లాడతానని ప్రకాశ్‌ రాజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Prakash Raj
Prakash Raj controversy
Ramayana
Hindu Dharma
Prakash Raj statement
Hindu sentiments
Social media
Political leaders
Criticism
Explanation

More Telugu News