టాస్ ఢిల్లీదే... 100 మ్యాచ్‌లతో ఆర్సీబీ అరుదైన రికార్డు

  • బెంగళూరుతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
  • చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది 100వ మ్యాచ్
  •  ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు
  • ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి ఇరు జట్లు 
ఐపీఎల్ లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) తలపడుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ స్టేడియంలో ఆర్సీబీకి ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది.

టాస్ గెలిచిన అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ మాట్లాడుతూ, "పిచ్ బాగుంది. ఇది డే గేమ్ కావడంతో కాస్త నెమ్మదిగా ఉండొచ్చు. చిన్నస్వామి సాధారణంగా ఛేజింగ్ గ్రౌండ్, అందుకే మేము బౌలింగ్ ఎంచుకున్నాం" అని తెలిపాడు. వరుస ఓటముల తర్వాత వచ్చిన విరామం జట్టు తిరిగి పుంజుకోవడానికి సహాయపడిందని అన్నాడు.

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ మాట్లాడుతూ, "మేము కూడా మొదట బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. ఇది మంచి పిచ్, మంచి స్కోరు చేసి వారిపై ఒత్తిడి పెంచుతాం" అని ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది ఫైనల్ చిన్నస్వామిలోనే జరగనున్నందున, సొంతగడ్డపై అన్ని మ్యాచ్‌లు గెలవడం ముఖ్యమని చెప్పాడు. ఇరు జట్లు తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, సుయాశ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్.

ఢిల్లీ క్యాపిటల్స్: పతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అకిబ్ నబీ దార్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి. నటరాజన్, ముఖేష్ కుమార్.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రసిఖ్ సలామ్ దార్, వెంకటేష్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, మంగేష్ యాదవ్, విక్కీ ఓస్త్వాల్.

ఢిల్లీ క్యాపిటల్స్: విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దుష్మంత చమీర, నితీశ్ రాణా.



RCB
Royal Challengers Bangalore
Delhi Capitals
Axar Patel
Rajat Patidar
IPL 2024
Chinnaswamy Stadium
Virat Kohli
Cricket
IPL Records

More Telugu News