మాజీ ఉప ముఖ్యమంత్రికే గన్ గురిపెట్టిన ఆగంతకుడు.. గురుగ్రామ్‌లో హైడ్రామా

  • హరియాణా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కారును అడ్డగించి బెదిరింపులు
  • దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసు వాహనంలో రావడంతో అనుమానాలు
  • ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన గురుగ్రామ్ పోలీసులు
హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. గురుగ్రామ్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన ఓ వ్యక్తి, నేరుగా ఆయనపైకి పిస్టల్ గురిపెట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో హర్యానా రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.

వివరాల్లోకి వెళితే.. దుష్యంత్ చౌతాలా తన కారులో వెళుతుండగా పోలీసు వాహనం అడ్డగించింది. అందులో నుంచి ఓ వ్యక్తి కిందికి దిగి తన వద్ద ఉన్న పిస్టల్‌ తో కారు లోపల ఉన్న చౌతాలాకు గురిపెట్టాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన చౌతాలా భద్రతా సిబ్బంది, అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది. ‘పోలీసు వేషంలో గూండాలు’ (#PoliceKeBheshMeinGunde) అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజన్లు, జేజేపీ కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు. నిందితుడి ప్రవర్తన, తీరు చూస్తుంటే అతను నకిలీ పోలీసు అయిఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఉప ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.

Dushyant Chautala
Haryana
JJP
Gurugram
pistol threat
deputy chief minister
political news
crime
security breach
police

More Telugu News