ధర్మానికి ఎదురు నిలిచిన వారు చరిత్రలో నిలవలేదు: శ్రీరాముడి గురించి నాగబాబు ట్వీట్

Nagababu Comments on Sri Rama and Dharma
  • శ్రీరాముడి గురించి నాగబాబు ఆసక్తికర ట్వీట్
  • హిందువులకు రాముడు కేవలం దేవుడు కాదు... అంతకుమించి అంటూ నాగబాబు ట్వీట్
  • ఆయన ధర్మానికి ప్రాణం, సత్యానికి, న్యాయానికి ప్రతిరూపం అని వెల్లడి
  • రాముడిని అవమానించడం అంటే తమను తామే గాయపరచుకోవడం అంటూ వ్యాఖ్యలు
జనసేన పార్టీ ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు శ్రీరాముడిపై కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు హిందువులకు కేవలం దేవుడు మాత్రమే కాదని, ఆయన ధర్మానికి, సత్యానికి, న్యాయానికి నిలువెత్తు రూపమని స్పష్టం చేశారు. రాముడిని కించపరిచే వారిని ఉద్దేశించి ఆయన తీవ్రంగా స్పందించారు.

"శ్రీరాముడు హిందువులకు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు. ఆయన మా ధర్మానికి హృదయస్పందన, సత్యం మరియు న్యాయం అనే శాశ్వత జ్యోతి. ఆయన్ను అవమానించడం లేదా కించపరచడం అనేది ధైర్యానికి నిదర్శనం కాదు, అది అహంకారం, క్షీణత నుంచి పుట్టిన అంధత్వం.

రాముడిని ఎగతాళి చేయడానికి సాహసించే వారు ఆయనను గాయపరచలేరు, వారు తమను తామే గాయపరచుకుంటారు. ఎందుకంటే ధర్మం నాశనం లేనిది, దానికి రక్షకులుగా నిలిచేవారు వెనుతిరగని వారు. ధర్మానికి, నీతికి వ్యతిరేకంగా నిలబడిన వారిని చరిత్రే అణిచివేసింది. ఇప్పుడు రాముడిపై విషం చిమ్మే వారి గతి కూడా అంతే.

ఆయన నామం మాకు ఒక కవచం. ఆయన కథ మాకు ఒక ఖడ్గం. ఆయన ఉనికి మన నాగరికతకు ఎవరూ కదిలించలేని అభేద్యమైన కోట. జై శ్రీరామ్" అంటూ నాగబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
Go Back to Shorts
Nagababu
Sri Rama
Hinduism
Dharma
Satyam
Justice
Janasena Party
Ramayana
Hindu Gods
Indian Culture

More Telugu News