మెగా ఫ్యామిలీపై వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు

Anudeep Katikala Faces Complaint to Telangana Deputy CM Over Mega Family Comments
  • కమెడియన్ అనుదీప్ కటికలపై డిప్యూటీ సీఎం భట్టికి ఫిర్యాదు
  • పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యల దుమారం
  • చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన భట్టి విక్రమార్క
  • మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న అభిమాన సంఘాల నేతలు
స్టాండప్ కామెడీ పేరుతో మెగా ఫ్యామిలీ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారంటూ కమెడియన్ అనుదీప్ కటికలపై అఖిల భారత చిరంజీవి యువత తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఆయన, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వన్ కల్యాణ్, నటుడు రామ్ చరణ్ గారు, నిర్మాత, నటి నిహారిక వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా అనుదీప్ కటికల వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్టాండప్ కామెడీ ముసుగులో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, తెలంగాణ చిరంజీవి యువత అధ్యక్షుడు వెల్పుల వెంకటేశ్ తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "మెగా ఫ్యామిలీపై వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు" అని హెచ్చరించారు. 
Go Back to Shorts
Anudeep Katikala
Mega Family
Chiranjeevi
Pawan Kalyan
Ram Charan
Niharika Konidela
Mallu Bhatti Vikramarka
Telangana Deputy CM
Standup Comedy
Personal Attacks

More Telugu News